స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య | special branch si commits suicide in vijaya nagaram | Sakshi
Sakshi News home page

స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య

Jan 15 2016 3:42 AM | Updated on Nov 6 2018 7:56 PM

స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య - Sakshi

స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య

విజయనగరంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న మార్కొండపట్నాయకుని చిన్నికృష్ణారావు(43) ఆత్మహత్యకు పాల్పడ్డారు.

విజయనగరం క్రైం: విజయనగరంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న మార్కొండపట్నాయకుని చిన్నికృష్ణారావు(43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు, బంధువుల కథనం ప్రకారం. సీతానగరం మండల కేంద్రానికి చెందిన ఈయన 1993లో పోలీసు కానిస్టేబుల్‌గా చేరి, 2010లో హెచ్‌సీగా, 2014లో ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. గురువారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయనకు భార్య జ్యోతి, కుమారుడు రాకేష్(17) ఉన్నారు. కుమారుడు  హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement