సీఎం పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు | Special arrangements for a trip to CM | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు

Aug 23 2014 4:37 AM | Updated on Mar 21 2019 8:16 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జిల్లాలో పర్యటించనకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు.

నెల్లూరు(పొగతోట): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జిల్లాలో పర్యటించనకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో ముఖ్యమంత్రి పర్యటనపై వివిధశాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి 24న వెంకటాచలంలో పర్యటించనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయాలన్నా రు. సీఎంతో పాటు జిల్లాకు వచ్చే ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సీఎం పర్యటించే ప్రాంతాల్లో వైద్యుల బృందంతో పాటు ఫైరింజన్ అందుబాటులో ఉండాలన్నారు. వృత్తి విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులతో సీఎం ముఖముఖి కార్యక్రమం ఉంటుందన్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం మొక్కలు నాటే ప్రాంతాల్లో ఏర్పా ట్లు చేయాలని సూచించారు.

అనంతరం రేషన్‌కార్డులు, గ్యాస్ వినియోగదారుల, స్కాలర్‌షిప్‌లు, పాసుపుస్తకాలకు సంబంధించి ఆధార్ సీడీంగ్‌పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ రేఖారాణీ, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్‌ఓ నాగేశ్వరరావు, జెడ్పీ సీఈఓ ఎం.జితేంద్ర, డీఆర్‌డీఏ పీడీ చంద్రమౌళి, డీఎస్‌ఓ శాంతకుమారి, డీఎం ధర్మారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement