రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి | Software engineer dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

Jul 3 2017 8:42 PM | Updated on Aug 30 2018 4:10 PM

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి - Sakshi

రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరుజిల్లా వాల్మీకిపురం మండలం పత్తేపురానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుమారుడు టి.హరినాథ రెడ్డి(36) బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. భార్యతో కలిసి రెండు రోజుల క్రితం పత్తేపురం వచ్చాడు. ఆదివారం కుటుంబ సభ్యులతో గడిపాడు. సోమవారం తెల్లవారుజామున తన బావమరిది ఓబుల్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై బెంగళూరు బయలుదేరాడు.

ఆంధ్రా సరిహద్దులోని కర్ణాటకలోని రాయల్పాడు వద్ద ఇన్నోవా వాహనం వేగంగా వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న హరినాథరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఓబుల్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలపడంతో సీటీఎం రోడ్డులోని చంద్రమోహన్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement