స్వామివారి హుండిలో పాము | Snake in mantralayam raghavendra swamy temple | Sakshi
Sakshi News home page

స్వామివారి హుండిలో పాము

Jun 12 2015 10:39 AM | Updated on Sep 3 2017 3:38 AM

స్వామివారి హుండిలో పాము

స్వామివారి హుండిలో పాము

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది.

కర్నూలు: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్న రాఘవేంద్ర స్వామి వారి దేవాలయంలోకి పాము ప్రవేశించింది. ఆ విషయం గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిని పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. దాంతో పాము అక్కడే ఉన్న దేవుని హుండీలోకి వెళ్లింది. దీంతో స్వామి వారి ఆలయంలోకి వీఐపీ దర్శనాలతోపాటు హుండిలో భక్తులు వేసే కానుకలను నిలిపివేశారు. పామును బయటకు రప్పించేందుకు ఆలయ భద్రత సిబ్బంది చర్యలు చేపట్టారు.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement