
అమరావతిలోని ఏపీ సచివాలయంలో పాము కలకలం సృష్టించింది.
సాక్షి,అమరావతి: అమరావతిలోని ఏపీ సచివాలయంలో పాము కలకలం సృష్టించింది. సెక్రటేరియట్‌లోని రెండవ బ్లాక్‌లో మంగళవారం పాము కనిపించింది. కార్యాలయంలోకి పాము రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు.
హోం శాఖ సెక్షన్‌ను కార్మికులు శుభ్రం చేస్తున్న సమయంలో పాము బయటదకు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు దాన్ని చంపేశారు. దీంతో ఉద్యోగులు ఊపిరి తీసుకున్నారు. ఈ సంఘటనతో గంట సేపు హోమ్ శాఖ కార్యాలయంలో పనులు నిలిచిపోయాయి.