నందలూరులో రూ.25వేలకే బుల్లెట్‌!

Smuggling Bullet Bike Low Caste In Kadapa - Sakshi

ఇదో రకమైన స్మగ్లింగ్‌

సాక్షి, రాజంపేట: బుల్లెట్‌ రూ.25 నుంచి రూ.35వేలకే వస్తోందంటే ఆశ్చర్యమే కదూ... వైఎ​స్సార్‌ కడప జిల్లా నందలూరులో పలువురు యువకుల చేతిలో బుల్లెట్‌ కనిపిస్తోందంటే ఇదే కారణం అన్న భావన వినిపిస్తోంది. అసలు విషయం ఏమిటంటే కర్ణాటక నుంచి నందలూరు తదితర ప్రాంతాలకు బుల్లెట్, పల్సర్‌ లాంటి బైకులను తీసుకొచ్చి అతి తక్కువ ధర విక్రయించే ముఠా వ్యవహారం నందలూరులో బట్టబయలైంది. రూ.1లక్షకు పైగా ఉన్న బుల్లెట్‌ ద్విచక్రవాహనం ధర రూ.50 వేలకే లభ్యం కావడంతో యువత ఎగబడి కొన్నారు. నందలూరు పోలీసులకు అనుమానం వచ్చి రెండురోజుల కిందట  బుల్లెట్‌ వాహనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. వీటిని స్మగ్లింగ్‌ చేసే అసలు వ్యక్తి కోసం పోలీసులు రంగంలోకి దిగారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను స్టేషన్‌కు తరలించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top