
కర్నూలు, ఆలూరు: ఆలూరు పట్టణంలోని సిద్ధేశ్వరస్వామి కాలనీలో నివాసముంటున్న శేఖర్ అనే వ్యక్తికి చెందిన వివో కంపెనీ స్మార్ట్‌ఫోన్ పేలింది. దీంతో దాదాపు రూ.50 వేల విలువైన సామగ్రి కాలి బూడిదైంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శేఖర్ గురువారం స్మార్ట్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి..దాన్ని బెడ్‌పై ఉంచాడు. ఉన్నట్టుండి పేలిపోయింది. దీంతో బెడ్‌కు నిప్పంటుకుంది. తర్వాత మంటలు వ్యాపించి అక్కడే ఉన్న దుస్తులు, టీవీ, ఇతర వస్తువులు కాలిపోయాయి. ఆ సమయంలో సమీపాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెద్ద శబ్దం రావడంతో గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందన్న అనుమానంతో బయటకు పరుగులు తీశామని శేఖర్ భార్య జానకమ్మ చెప్పారు.