బస్సును ఢీకొన్న లారీ: ఆరుగురి మృతి | six killed in road accident | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ: ఆరుగురి మృతి

Sep 8 2014 2:46 PM | Updated on Aug 30 2018 3:58 PM

మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది.

కల్పలమడుగు:మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని పొట్టన పెట్టుకుంది. కోలార్ జిల్లాలోని కల్పలమడుగు వద్ద సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక బస్సును అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 20 మందికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement