
ఇది ఆరడుగుల రాఖీ..
కుక్క పిల్లలు అనగానే...మనకు వెంటనే ముద్దొచ్చే చిట్టిపొట్టి పెట్టీస్... చెంగుచెంగున ఎగురుతూ ఎదుటి వారిని ఆట పట్టించే బుజ్జిబుజ్జి పిల్లలే కనిపిస్తాయి.
కుక్క పిల్లలు అనగానే...మనకు వెంటనే ముద్దొచ్చే చిట్టిపొట్టి పెట్టీస్... చెంగుచెంగున ఎగురుతూ ఎదుటి వారిని ఆట పట్టించే బుజ్జిబుజ్జి పిల్లలే కనిపిస్తాయి. విజయవాడ కేఎల్ రావు నగర్కు చెందిన 'రాఖీ' మాత్రం అలా కాదు. ఆరడుగుల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది. పులిని పోలిన ఆకారంతో భయపెడతుంది. అలా అని దీని వయస్సు ఎక్కువేం కాదు. కేవలం తొమ్మిది నెలలే.
కేఎల్ రావు నగర్కు చెందిన యలకల అనిల్ ఢిల్లీ నుంచి తెచ్చిన గ్రేట్ డేన్కు చెందిన కుక్క ఇది. తొమ్మిది నెలలకే ఆరగుడుల ఎత్తు ఎదిగిన రాఖీ పూర్తిస్థాయిలో తయారైతే సుమారు పది అడుగులకు చేరుతుందని అనిల్ తెలిపారు. దీంతో వాకింగ్ చేస్తుంటే అంతా విచిత్రంగా చూస్తున్నారని, దూరం నుంచి చూస్తే పులిని పోలి ఉండే ఈ కుక్క అందరినీ ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తుందని తెలిపారు. ఇంత ఎత్తున ఈ రాఖీ సాధారణ ఆహారాన్ని మాత్రమే తింటుందని అనిల్ పేర్కొన్నారు.