కన్నీటి పరీక్ష | Sister died : Attended the exams DED studnet | Sakshi
Sakshi News home page

కన్నీటి పరీక్ష

Sep 16 2018 8:48 AM | Updated on Nov 6 2018 4:10 PM

Sister died : Attended the exams DED studnet - Sakshi

– సోదరి మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ పరీక్ష రాసిన డీఈడీ విద్యార్థిని 
రాయచోటి రూరల్‌ : రాయచోటి జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన డీఈడీ విద్యార్థిని ఎన్‌.లక్ష్మి పరీక్షలకు హాజరయ్యారు. అయితే పరీక్ష ప్రారంభం అవుతున్న సమయానికి స్వగ్రామం మడకశిరలో తన సోదరి నాగవేణి అనారోగ్యంతో మృతి చెందిందనే వార్త తెలిసింది. దీంతో లక్ష్మి కన్నీరు మున్నీరైంది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె పరీక్ష రాసింది. పరీక్షా కేంద్రం చీఫ్‌ ఆఫీసర్‌ నాగముణిరెడ్డి ఆమెను ఓదార్చారు. పరీక్ష ముగిసిన అనంతరం మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో లక్ష్మి బయలుదేరి స్వగ్రామానికి వెళ్లింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement