ఎస్‌ఐ, గొర్రెల కాపరి బాహాబాహీ

SI And Shepherd Mutual Assault In Aluru Zone - Sakshi

సాక్షి, ఆలూరు: ఎస్‌ఐ, గొర్రెల కాపరి పరస్పరం దాడి చేసుకున్న సంఘటన ఆలూరు మండలంలోని గోనేహాలు–మనేకుర్తి గ్రామాల సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.  హాలహర్వి మండల ఎస్‌ఐ బాలనరసింహులు పని నిమిత్తం ఆదోని పట్టణానికి బైక్‌పై బయలుదేరారు. మనేకుర్తి–గోనేహాలు సమీపంలో రోడ్డుపై గొర్రెలు అడ్డొచ్చాయి. వాటిని పక్కకు తోలాలని కాపరి బీరప్పను దూషించారు. ఆయన మఫ్టీలో ఉండడంతో ఎస్‌ఐగా గుర్తించలేని గొర్రెల కాపరి కాస్త కటువుగానే మాట్లాడాడు. ‘నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? అవి మూగజీవాలు.. పక్కకు జరగాలని వాటికి తెలియద’ని అన్నాడు.దీంతో ఎస్‌ఐ.. గొర్రెల కాపరి చెంప చెళ్లుమనిపించాడు. దీంతో అతను కూడా ఎదురుదాడికి దిగాడు. సంఘటన తరువాత ఎస్‌ఐ ఆలూరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి గొర్రెల కాపరి కోసం గాలిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top