శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబాటు యత్నం | Shruti Haasan attacked by stalker in her Mumbai apartment | Sakshi
Sakshi News home page

శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబాటు యత్నం

Nov 20 2013 3:17 AM | Updated on Sep 2 2017 12:46 AM

శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబాటు యత్నం

శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబాటు యత్నం

గుర్తుతెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు.

ముంబై: గుర్తుతెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. శ్రుతి సన్నిహిత వర్గాల ప్రకారం.. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది.

‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది.

తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement