breaking news
Mumbai apartment
-
ఖరీదైన అపార్ట్మెంట్లు.. బాలీవుడ్ నటులకు భారీ లాభాలు
ముంబైలోని ఖరీదైన అపార్ట్మెంట్లు బాలీవుడ్ నటులకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ నటి మలైకా అరోరా ముంబైలోని అంధేరీ వెస్ట్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను రూ.5.30 కోట్లకు అమ్మేసింది. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ ప్లాట్‌ఫామ్ స్క్వేర్ యార్డ్స్ ప్రకారం.. ఈ లావాదేవీ 2025 ఆగస్టులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వద్ద నమోదైంది. అంధేరి వెస్ట్ లోని లోఖండ్ వాలాలో ఉన్న రన్వాల్ ఎలిగంటే అనే హై ఎండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఈ ప్రాపర్టీ ఉంది.రూ.2.04 కోట్ల లాభంమలైకా ఈ అపార్ట్‌మెంట్‌ను 2018 మార్చిలో రూ.3.26 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే ఆమె దీనిపై 62 శాతం రూ.2.04 కోట్ల లాభాన్ని ఆర్జించారు. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 1,369 చదరపు అడుగులు, బిల్టప్ ఏరియా 152.68 చదరపు మీటర్లు. ఈ సేల్ లో ఒక కారు పార్కింగ్ స్పేస్ కూడా ఉంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.31.08 లక్షలు, రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.30 వేలు చెల్లించారు.స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం.. 2024 సెప్టెంబర్ నుంచి 2025 ఆగస్టు మధ్య రన్వాల్ ఎలిగెంట్ ప్రాజెక్టులో మొత్తం రూ.109 కోట్ల విలువైన 22 రిజిస్టర్డ్ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో సగటు ప్రాపర్టీ ధర చదరపు అడుగుకు రూ.33,150గా ఉంది. అంధేరి వెస్ట్ ముంబైలో అత్యంత డిమాండ్ ఉన్న నివాస ప్రాంతాలలో ఒకటి. లగ్జరీ అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ హబ్‌లకు ఇది ప్రసిద్ధిగాంచిది.టైగర్ ష్రాఫ్‌కు రూ.3.98 కోట్ల లాభంమరో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ముంబైలోని ఖర్ లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్ మెంట్ ను విక్రయించాడు. (Tiger Shroff sells Mumbai apartment) 2025 సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ అపార్ట్ మెంట్ అత్యాధునిక రుస్తుంజీ పారామౌంట్ ప్రాజెక్టులో భాగం. దీని కార్పెట్ ఏరియా 1,989.72 చదరపు మీటర్లు, బిల్టప్ ఏరియా 2,189 చదరపు మీటర్లు. ఈ ఫ్లాట్ లో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉండటం గమనార్హం.2018లో టైగర్ ఈ ప్రాపర్టీని రూ.11.62 కోట్లకు కొనుగోలు చేశాడు. 2025లో రూ.15.60 కోట్లకు విక్రయించి రూ.3.98 కోట్ల లాభం, పెట్టుబడిపై 34.25 శాతం రాబడి వచ్చింది. ఈ లావాదేవీకి రూ.93.60 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఈ అపార్ట్మెంట్ వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే, రాబోయే మెట్రో మార్గాలతో బాగా అనుసంధానమై ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్, లోయర్ పరేల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలక ప్రదేశాలకు ఇది దగ్గరగా ఉంది.ఇదీ చదవండి: ఓయో కంపెనీ పేరు మారింది.. ఐపీఓ ముంగిట కీలక మార్పు -
మలైకా అరోరా అపార్ట్మెంట్ అద్దెకు.. రెంట్ ఎంతంటే?
ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్ 4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.మలైకా అరోరా తన అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్బర్గ్కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది. -
నేనిప్పుడు బాగానే ఉన్నా
దుండగుడు దాడిచేసిన ఘటన నుంచి శ్రుతి హాసన్ కోలుకుంటోంది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, ప్రస్తుతం అంతా బాగానే ఉందని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు, సినీరంగ ప్రముఖులకు చెబుతోంది. ఇప్పుడంతా చాలా బాగుందని, విషయం తెలుసుకుని తనను పరామర్శించినందుకు కృతజ్ఞతలు అని కూడా తన ట్విట్టర్ పేజీలో రాసింది. దాడి విషయం తెలియగానే పలువురు శ్రుతి ట్విట్టర్లో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు పోస్టుచేశారు. దీంతో దాదాపుగా రాత్రి పన్నెండు గంటల నుంచి అందరికీ సమాధానాలు ఇస్తూ వచ్చింది. మంగళవారం ఉదయం 9.30 గంటలకు గుర్తుతెలియని దుండగుడు ఒకడు శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకు యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. శ్రుతి సన్నిహిత వర్గాల ప్రకారం.. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది. ‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. @bornkhaleesi thanks my darling xo — shruti haasan (@shrutihaasan) November 20, 2013 @imKBRshanthnu thanks maa am ok now :) — shruti haasan (@shrutihaasan) November 20, 2013 @khushsundar thanks mam am doing much better - cops are on it.. thanks for checking on me :) — shruti haasan (@shrutihaasan) November 20, 2013 I'm doing fine and thankyou for the concern - — shruti haasan (@shrutihaasan) November 19, 2013 -
శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబాటు యత్నం
ముంబై: గుర్తుతెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. శ్రుతి సన్నిహిత వర్గాల ప్రకారం.. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది. ‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది. తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.


