
ఆలయం వద్ద శ్రేయారావు
సాక్షి, తిరుమల: జూన్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో మిస్ ఇండియా సాధించాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని, తాను మిస్ ఇండియా కిరీటం సాధిస్తాననే నమ్మకం ఉందని శ్రేయారావు అన్నారు. శుక్రవారం ఆమె సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. మిస్ ఇండియా పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 30 మంది ఎంపికయ్యారని, తాను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. మే నెల నుంచి నెల రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 23వ తేదీన ఫైనల్ పోటీలు ఉంటాయని పేర్కొ న్నారు. తిరుమల దర్శనం ఎంతో ప్రశాంత తను ఇచ్చిందన్నారు.