
శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం: హెల్త్ బులెటిన్
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి (43) పరిస్థితి చాలా విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి (43) పరిస్థితి చాలా విషమంగా ఉందని కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఉదయం 10.30 గంటల తర్వాత హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. నిపుణులైన వైద్యులు పరీక్షలు చేస్తున్నారని, ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. సీటీ స్కాన్, ఎమ్మారై తదితర పరీక్షలు చేశారు. పక్కటెముకలు విరిగి ఛాతీలోకి చొచ్చుకెళ్లినట్లు తెలిసింది. మెడమీద కూడా గాయాలయ్యాయి. మల్టిపుల్ ఇంజ్యురీస్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. హృదయస్పందన, బీపీ, పల్స్ రేట్లు నార్మల్గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరిన్ని పరీక్షలు చేయాల్సి ఉందని చెప్పారు.
ఇలాంటి విషమ పరిస్థితుల్లో రోగులు త్వరగా చికిత్సకు స్పందించరని, మరికొంత సమయం గడిస్తే తప్ప ఎలా స్పందిస్తున్నారన్న విషయం నిర్ధరించలేమని అన్నారు. రాత్రి ప్రమాదం జరిగి, తెల్లవారుజామున ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనపడకపోవడం మాత్రం ఆందోళనకరంగా ఉంది.