వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల | Sharmila attends YS Vijayamma's meeting with party senior leaders | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల

Sep 20 2013 6:41 PM | Updated on May 25 2018 9:10 PM

వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల - Sakshi

వైఎస్సార్ సీపీ సమావేశంలో షర్మిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. తన తల్లితో కలిసి షర్మిల కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. షర్మిల మొట్టమొదటిసారిగా ప్రధాన కార్యాలయంలో  పార్టీ సమావేశంలో పాల్గొనడం విశేషం. రేపు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఎజెండాను ఖరారు చేసే అంశంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. పార్టీ సీఈసీ సభ్యులు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రేపు ఉదయం సీజీసీ నేతలతో పాటు పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ) సభ్యులు, జిల్లా కన్వీనర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, అధికార ప్రతినిధులందరితో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమైక్య ఉద్యమాన్ని గ్రామగ్రామాన విస్తరించడం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ద్వంద్వ ప్రమాణాలు వీడి సమైక్యం కోసం ఉద్యమించేలా ఒత్తిడి పెంచడంతో పాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ఈ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement