హెలెన్ తుపాను అనుభవాలు పంచుకోండి | Share your experiences of Cyclone Helen with Sakshi | Sakshi
Sakshi News home page

హెలెన్ తుపాను అనుభవాలు పంచుకోండి

Published Fri, Nov 22 2013 1:44 PM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

హెలెన్ తుపాను అనుభవాలు పంచుకోండి

హెలెన్ తుపాను అనుభవాలు పంచుకోండి

మీ ప్రాంతంలో తుపాను కలిగిస్తున్న నష్టాల గురించి సమాచారం, ఫొటోలు, వీడియోలను మాకు పంపండి.

ఒక్క పక్క విభజన దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో రాజకీయ సంక్షోభంలో  చిక్కిన ఆంధ్రప్రదేశ్ మీద మరో పక్క ప్రకృతి కూడా తన ప్రతాపం చూపిస్తోంది. ఫై-లీన్ తుపాను దెబ్బ మీద దెబ్బగా పెను వాన బీభత్సం, ఇప్పుడు ఈ హెలెన్ తుఫాను. ఒకదాని వెనక మరొకటిగా ముంచుకొస్తున్న తుపాన్లు తీరాలు దాటుతున్నాయి. కానీ, ఆ విలయాల బీభత్సం, చేసిన గాయాలు మిగిలే ఉంటున్నాయి. మీకు ప్రత్యక్ష అనుభవంలోకి వస్తున్న ఈ విషయాల్నిపదిమందితో పంచుకోవాలని ఉందా? మీ ప్రాంతంలో తుపాను కలిగిస్తున్న నష్టాల గురించి సమాచారం, ఫొటోలు, వీడియోలను మాకు పంపండి. మీరు పంపిన సమాచారాన్ని సమగ్రంగా అందరికీ అందిస్తాం. మీరు సమాచారం పంపాల్సిన మెయిల్ ఐడీ..sakshidaily@gmail.com

ఆండ్రాయిడ్, ఐఫోన్ల నుంచి సాక్షి న్యూస్ యాప్ ద్వారా కూడా ఈ సమాచారాన్ని మాకు అందజేయొచ్చు. అందుకుసాక్షి యాప్ లో ఉన్న 'ప్రత్యక్ష సాక్షి'అనే లింకును ఉపయోగించండి. దానిద్వారా ఫొటోలు, వీడియోలు పంపండి. 

మీరు పంపిన కథనాలు, ఫొటోలు, వీడియోలను వాటిని sakshi.com ద్వారా ఈ ప్రపంచానికి మేం అందిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement