యూపీలో తుపాన్‌ బీభత్సం.. 101 మంది మృతి | 40 people killed in cyclone in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

యూపీలో తుపాన్‌ బీభత్సం.. 101 మంది మృతి

May 14 2026 7:14 AM | Updated on May 14 2026 1:50 PM

40 people killed in cyclone in Uttar Pradesh

లక్నో: యూపీలో తుపాన్‌ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా సంభవించిన బలమైన తుఫానులు, భారీ వర్షాల దాటికి 101 మంది  ప్రాణాలు కోల్పోయారు.  రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగులు, వర్షాలు, బలమైన తుఫాను గాలుల కారణంగా ఈ మరణాలు సంభవించాయని రాష్ట్ర విపత్తుల సంఘం పేర్కొంది.

రాష్ట్ర సహాయక కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు ప్రభావం ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. దీని వల్ల అనేక చోట్ల మరణాలు సంభవించాయి.

మృతుల్లో ఎక్కువ మంది పొలాల్లో పని చేస్తున్న వారు లేదా వర్షం నుండి తప్పించుకోవడానికి చెట్ల కింద ఆశ్రయం పొందిన వారే ఉన్నట్లు సమాచారం. అయితే తుపాన్‌ ప్రభావంతో అధికంగా ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో 21 మంది మృతిచెందగా, మీర్జాపూర్‌లో 17 మరణాలు, ఫతేపూర్‌లో 10, బదౌన్‌లో ఆరుగురు చనిపోయినట్లు రాష్ట్ర విపత్తు సంఘం ప్రకటించింది. దీంతో పాటుగా పెద్ద ఎత్తున ఆర్థిక నష్టం వాటిల్లినట్లు తెలిపింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement