భూమి నుంచి విడిపోయిన క్షణం..! | Bareilly Man Thrown 50 Feet In Air By Strong Wind Hands Legs Broken | Sakshi
Sakshi News home page

భూమి నుంచి విడిపోయిన క్షణం..!

May 14 2026 4:09 PM | Updated on May 14 2026 4:23 PM

Bareilly Man Thrown 50 Feet In Air By Strong Wind Hands Legs Broken

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో బలమైన గాలుల కారణంగా ఒక వ్యక్తి రేకుల షెడ్‌తో పాటు గాల్లోకి ఎగిరి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి కిందపడిన ఘటన చోటుచేసుకుంది.  బలమైన గాలుల కారణంగా నన్హే మియాన్‌ అనే వ్యక్తి గాల్లో 50 అడుగుల ఎత్తు వరకూ వెళ్లి కిందపడ్డాడు.  దాంతో అతని చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొం‍దుతున్నాడు. 

తాను తాడు పట్టుకుని ఉన్నప్పుడు బలమైన గాలులు వీయడంతో, తనతో పాటు ఆ రేకుల షెడ్‌ కూడా గాలిలోకి ఎగిరిపోయిందని అతను చెప్పాడు. బలమైన గాలుల కారణంగా ఆ రేకుల షెడ్‌కు కట్టి ఉన్న తాడును ప​ట్టుకున్నానని, అయితే ఆ షెడ్‌తో పాడు తాను గాల్లోకి  ఎగిరిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.  తాను తాడు పట్టుకోవడంతో సేఫ్‌గా ఉంటానని అనుకున్నానని, ఇలా జరుగుతుందని అనుకోలేదన్నాడు. 

ప్రకృతి గర్జన కారణంగా ఇలా భూమి నుంచి విడిపోయి.. ఒక్కసారిగా ఆకాశం వైపు దూసుకెళ్లి కింద పడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  ప్రకృతి ముందు మనిషి, టెక్నాలజీ అనే ఏమీ పని చేయదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

కాగా, యూపీలో తుపాన్‌ బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా  పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా సంభవించిన బలమైన తుఫానులు, భారీ వర్షాల దాటికి సుమారు 100 మంది  ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పిడుగులు, వర్షాలు, బలమైన తుఫాను గాలుల కారణంగా ఈ మరణాలు సంభవించాయని రాష్ట్ర విపత్తుల సంఘం పేర్కొంది.

రాష్ట్ర సహాయక కమిషనర్ కార్యాలయం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఈ ప్రకృతి విపత్తు ప్రభావం ప్రయాగ్‌రాజ్, కాన్పూర్ దేహత్, ఫతేపూర్ వంటి జిల్లాలపై తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీ వడగళ్ల వానతో పాటు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. దీంతో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. అనేక చోట్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement