మందుగుండు పేలి ఐదుగురి పరిస్థితి విషమం | seven injured in balst of fireworks | Sakshi
Sakshi News home page

మందుగుండు పేలి ఐదుగురి పరిస్థితి విషమం

Feb 15 2015 3:22 PM | Updated on Sep 13 2018 5:25 PM

ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి అమ్ముతుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ పేలుడు సంభవించింది.

శ్రీకాకుళం: ఓ ఇంట్లో మందుగుండు సామగ్రి అమ్ముతుండగా ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మరువాడలో చోటు చేసుకుంది. క్షతగాత్రుల్లో మందుగుండు వ్యాపారి కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఆరేళ్ల బాలికతో పాటు బాణసంచా కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు గాయపడినట్లుగా సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
(వంగర)

Advertisement
 
Advertisement
Advertisement