పట్టణంలోని డీలక్స్ సెంటర్ చర్చివద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ
సాలూరు: పట్టణంలోని డీలక్స్ సెంటర్ చర్చివద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు చర్చి దగ్గరకు వచ్చేసరికి ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తున్న రజనీకాంత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బైక్ కూడా నుజ్జునుజ్జైంది. క్షతగాత్రుడ్ని స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
బైక్ బోల్తా పడి ఒకరికి..
అలమండ (జామి): బైక్ బోల్తాపడడంతో ఒకరు గాయపడిన సంఘటన అలమండలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. ఎ. కాశీ (26) ఎలమంచిలి నుంచి విజయనగరం వైపు బైక్‌పై వస్తుండగా, అలమండ వంతెన సమీపంలో అదుపు తప్పి పడిపోయూడు. దీంతో శివకు తీవ్ర గాయూలయ్యూరుు. స్థానికులు వెంటనే క్షతగాత్రుడ్ని 108లో విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.