పులివెందులలో వైఎస్‌ జగన్‌ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు  | Security arrangements at YS Jagan house in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ జగన్‌ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లు 

May 27 2019 3:48 AM | Updated on May 27 2019 3:48 AM

Security arrangements at YS Jagan house in Pulivendula - Sakshi

వైఎస్‌ జగన్‌ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ సెంథిల్‌కుమార్‌

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని బాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఇంటిని ఆదివారం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఇతర పోలీసు అధికారులతో కలసి సందర్శించారు. వైఎస్‌ జగన్‌ ఇంటివద్ద ఎలాంటి భద్రత ఏర్పాటు చేయాలి, సీసీ కెమెరాలు ఎక్కడ అమర్చాలి, సందర్శకులను ఇంటి లోపలికి ఏవిధంగా పంపించాలి అనే అంశాలపై  చర్చించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు.

ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్, అగ్నిమాపక అధికారులకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కూడా వారు పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులరెడ్డి, ఇంటలిజెన్స్‌ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, పులివెందుల డీఎస్పీ నాగరాజు, అర్బన్‌ సీఐ రామాంజి నాయక్, రూరల్‌ సీఐ రామకృష్ణుడు, ఎస్‌ఐ శివప్రసాద్‌ ఇతర సిబ్బంది 
పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement