గల్లంతైన వారి కోసం గాలింపు | search for missing Persons | Sakshi
Sakshi News home page

గల్లంతైన వారి కోసం గాలింపు

Nov 22 2015 11:17 AM | Updated on Aug 24 2018 2:36 PM

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం బల్లకట్టు సైడ్ గ్రిల్ విరిగి రామన్నపేటకు చెందిన నరసింహారావు, గోపి, రమణ నదిలో పడిపోయారు. అయితే, తమ పరిధిలోకి రాదంటూ ఇటు కృష్ణా, అటు గుంటూరు జిల్లాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా... నదిలో గల్లంతైన వారి ఆచూకీ లభించపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement