breaking news
Pontoon
-
గల్లంతైన వారి కోసం గాలింపు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం రామన్నపేట వద్ద కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురి కోసం స్థానికులు తీవ్రంగా గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం బల్లకట్టు సైడ్ గ్రిల్ విరిగి రామన్నపేటకు చెందిన నరసింహారావు, గోపి, రమణ నదిలో పడిపోయారు. అయితే, తమ పరిధిలోకి రాదంటూ ఇటు కృష్ణా, అటు గుంటూరు జిల్లాల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్థానికులే గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగి 16గంటలు గడుస్తున్నా... నదిలో గల్లంతైన వారి ఆచూకీ లభించపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. -
బల్ల‘కట్టు’తప్పితే.. ఫట్టే !
హుజూర్నగర్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ కృష్ణానదిపై నడుపుతున్న బల్లకట్టు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బల్లకట్టుపై ప్రయాణం సాగిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకపోవడం, నిర్వహణలోపం, డ్రైవర్ల అనుభవరాహిత్యంతో బల్లకట్టు ప్రయాణం ప్రమాదాలకు నెల వైంది. కృష్ణానది ఒడ్డున ఉన్న నల్లగొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం మట్టపల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు జిల్లా తంగెడ వరకు, మేళ్లచెరువు మండలం చింతిర్యాల నుంచి మోర్జంపహాడ్, బుగ్గమాదారం మీదుగా గుంటూరు జిల్లా మాదిపహాడ్కు రోడ్డు మార్గం లేకపోవడంతో బల్లకట్టు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఆయా జిలా ల జిల్లా పరిషత్‌లు బల్లకట్టులు నడిపేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తాయి. నల్లగొండ జిల్లా పరిధిలోని మూడు రేవుల ద్వారా ఏడాదికి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. నిబంధనలకు నీళ్లు.. వేలంలో బల్లకట్టు నిర్వహణ హక్కులు పొం దిన వారు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంప్రతి రేవు నుంచి రెండు బల్లకట్టులు తిప్పాల్సి ఉండగా ఇరు జిల్లాల కాంట్రాక్టర్లు సిండికేట్‌గా ఏర్పడి ఒకే బల్లకట్టును నడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గం టల వరకు మాత్రమే బల్లకట్టు తిప్పాల్సి ఉంది. సమయ పాలన లేకుండా రాత్రింబవళ్లు బల్లకట్టులు నిర్వహిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనిప్రయాణికులుఆరోపిస్తున్నారు. రేవులకు ఆదాయం ఘనం.. అభివృద్ధి శూన్యం జిల్లాలోని మూడు బల్లకట్టు రేవుల ద్వారా నిత్యం సుమారు 3వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి నుంచి నామమాత్రంగా డబ్బులు వసూలు చేయాల్సి ఉండగా ఒక్కొక్కరి నుంచి రూ.10 పైనే వసూలు చేస్తున్నారు. మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో సిమెంట్ పరిశ్రమలు విస్తరించి ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే సిమెంట్ లారీలు, కార్లు, జీపులు, మోటార్ సైకిళ్లు ఎక్కువ భాగం ఈ బల్లకట్టుల మీదుగానే వెళుతుంటాయి. రోజుకు సుమారు 100 లారీలు వెళ్తుండగా ఒక్కో లారికి రూ.600 చొప్పున, 150 కార్లు, జీపులు వెళ్తుండగా ఒక్కో దానికి రూ.300 చొప్పున, మోటార్ బైక్‌లకు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి, అటూ నిర్వాహకులకు లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా ఆయా రేవుల వద్ద ప్రయాణికుల కోసం షెల్టర్కానీ, బల్లకట్టు రక్షణ పరికరాలు కానీ ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. తరచు ప్రమాదాలు.. బల్లకట్టు నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, డ్రైవర్ల అనుభవలేమితో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. కాలం చెల్లిన బల్లకట్టులను నడుపుతుండడంతో అవి ఎప్పుడు మరమ్మతులకు గురవుతాయో తెలియని పరి స్థితి నెలకొంది. ఈ క్రమంలో గత ఏడాది మట్టపల్లి రేవు నుంచి బయలుదేరిన బల్లకట్టు గుంటూరు జిల్లా తంగెడ రేవు వద్ద ప్రమాదానికి గురైంది. దీంతో బల్లకట్టుపై ప్ర యాణిస్తున్న టిప్పర్ నదిలోకి పల్టీ కొట్టడంతో బల్లకట్టుపై పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 12న మధ్యాహ్న సమయంలో పెళ్లిబృందంతో పాటు సుమారు 100 మంది ప్రయాణికులతో మట్టపల్లి రేవు నుంచి తంగెడ రేవుకు బయలు దేరిన బల్లకట్టు మధ్యలో ఇం జిన్ ఆగిపోయింది. అదృష్టవశాత్తు నదిలో నీటి ప్రవాహం పెద్దగా లేకపోవడంతో ఈదురు గాలులకు బల్లకట్టు ఆవలి ఒడ్డుకు కొట్టుకొచ్చి ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అదే విధంగా గడిచిన ఏడాది బుగ్గమాదారం వద్ద కృష్ణానదిలో ఆవలి ఒడ్డువైపు సిమెంట్ లారీ బల్లకట్టు మీద నుంచి నదిలో పడిన సంఘటన చోటుచేసుకుంది. కొరవడిన పర్యవేక్షణ.. ప్రతి రోజు నల్లగొండ, గుంటూరు జిల్లాలకు చెందిన వేలాది మంది ప్రయాణికులు, వాహనాలు ఈ బల్లకట్టులపై ప్రయాణం సాగిస్తున్నాయి. బల్లకట్టు నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా సంబంధిత జిల్లా పరిషత్ అధికారులు ఏనాడూ పట్టించుకోలేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా నిబంధనల ప్రకారం బల్లకట్టులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
బల్లకట్టు చదువులు
బల్లకట్టుపై ప్రయాణం...ఒకే గదిలో ఐదు తరగతులకు విద్యా బోధన...అరకొర వసతులు..ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల కష్టాలు... ఎన్ని చట్టాలు చేసినా..ఎందరు పాలకులు మారినా వీరి కష్టాలు మాత్రం తొలగిపోవటం లేదు. ►బడికి పోవాలంటే కాలువ దాటాల్సిందే ►ఐదు తరగతులకు ఓకే ఒక్క గది ►ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ విద్యార్థుల కష్టాలు తెనాలి మారీసుపేట : ►తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కాలువ కట్టపై మూడు దశాబ్దాలుగా దాదాపు 70 ఎస్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి. ►ప్రభుత్వం వీరికి ఆసరా చూపించనప్పటికీ,అక్కడి చిన్నారుల కోసం 2001 లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. ►అప్పటి నుంచి పాఠశాలకు రావాలంటే బల్లకట్టుపై కొమ్మమూరు కాలువ దాటాల్సిందే. నిత్యం విద్యార్థులు సంగమేశ్వర స్వామి దేవస్థానం రోడ్డు నుంచి బల్లకట్టు ఎక్కి ఇవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు. ►బల్లకట్టుతో ఇబ్బంది వస్తే మరో నాలుగు కిలోమీ టర్లు చుట్టు తిరిగి గరువుపాలెం మీదుగా పాఠశాలకు చేరుకోవాలి. ►ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ఈ పరిస్థితి ప్రాణసంకటంగానే ఉంది. ►పూరిపాకలో ఏర్పాటు చేసిన పాఠశాలలో రికార్డు లకు భద్రత లేకపోవటంతో తెనాలి-వైకుంఠపురం రోటరీ క్లబ్ ప్రతినిధులు 2013లో స్పందించి రేకులతో ఓ గదిని నిర్మించారు. ►ఈ ఒక్క గదిలోనే 1 నుంచి 5 వరకు చదివే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. ►గతంలో ఈ పాఠశాలకు గ్రామంలోనే స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపడతామని అధికారులు చేసిన ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. ►పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు. ►విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో మరుగు దొడ్లు, రక్షిత మంచినీరు, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. ►విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. ►విద్యాశాఖ వద్ద నిధులున్నా ఇక్కడి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించటం లేదనే విమర్శలు వున్నాయి. ► గతంలో దాతల సహకారంతో నిర్మించిన ఒకే ఒక మరుగుదొడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల అవసరాలు తీరుస్తోంది. ►ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.