మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ల షెడ్యూల్‌  | Schedule notifications in another 15 days | Sakshi
Sakshi News home page

మరో 15 రోజుల్లో నోటిఫికేషన్ల షెడ్యూల్‌ 

Oct 1 2018 4:36 AM | Updated on Oct 1 2018 4:36 AM

Schedule notifications in another 15 days - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్‌ ఆఖరు నుంచి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) చైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.ఉదయభాస్కర్‌ తెలిపారు. డిసెంబర్‌ ఆఖరు నాటికి అన్ని నోటిఫికేషన్లు విడుదల చేసి.. పోస్టుల భర్తీ పరీక్షలు వచ్చే ఏడాది నిర్వహిస్తామని చెప్పారు. నోటిఫికేషన్ల షెడ్యూల్‌ను 15 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టుల ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే సిలబస్‌ను పెడుతున్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తు పూర్తయ్యిందని వెల్లడించారు. ఈ సిలబస్‌ను వచ్చే వారం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement