ఇంద్రకీలాద్రిపై సంపూ | Sampoornesh Babu Visit Indra Keeladri Temple | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై సంపూ

Oct 1 2018 1:07 PM | Updated on Oct 1 2018 1:07 PM

Sampoornesh Babu Visit Indra Keeladri Temple - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : సినీ హీరో సంపూర్ణేష్‌ బాబు ఆదివారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబును ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న సంపూర్ణేష్‌బాబు తన నటించిన నూతన చిత్రం కొబ్బరి మట్ట విజయవంతం కావాలని అమ్మవారికి మొక్కుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన సంపూర్ణేష్‌బాబుతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు భక్తులు ఉత్సాహం చూపించారు. కొంత మంది భక్తులు సంపూ మొదటి చిత్రమైన హృదయకాలేయం గురించి మాట్లాడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement