‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు | Sakshi Daily Photographers bags Anadhra Pradesh State Awards | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు

Aug 14 2013 12:27 AM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులు ‘సాక్షి’ ఫొటో గ్రాఫర్లకు లభించాయి.

ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్తమ ఫొటోగ్రాఫర్ అవార్డులు ‘సాక్షి’ ఫొటో గ్రాఫర్లకు లభించాయి. ఉత్తమ వార్తా చిత్రం విభాగంలో రాజమండ్రి సాక్షి ఫొటోగ్రాఫర్ టి.వీరభగవాన్, ప్రభుత్వ పథకాల విభాగంలో ఇందిరమ్మ కలలు పథకానికి నెల్లూరు సాక్షి ఫొటోగ్రాఫర్ ఎంవీ రమణకు కన్సొలేషన్ బహుమతులు లభించాయి.

వార్తా చిత్రం విభాగంలో మెట్రో ఇండియా ఫొటోగ్రాఫర్ డి.సుమన్‌రెడ్డి(హైదరాబాద్), ప్రభుత్వ పథకాల విభాగంలో వరంగల్ ఈనాడు ఫొటోగ్రాఫర్ ఎ.సంపత్‌కుమార్(బంగారుతల్లి)కు మొదటి బహుమతి లభించింది. మొదటి బహుమతి కింద రూ.15 వేల నగదు, రెండో బహుమతి కింద రూ.10 వేలు, మూడో బహుమతి కింద రూ.6 వేలు, కన్సొలేషన్ బహుమతి కింద రూ.3 వేల నగదును ప్రభుత్వం అందజేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement