'మా అమ్మాయిని అల్లుడే చంపాడు' | Sai sindhu died in california | Sakshi
Sakshi News home page

'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'

Feb 11 2015 4:00 PM | Updated on Sep 28 2018 3:39 PM

'మా అమ్మాయిని అల్లుడే చంపాడు' - Sakshi

'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'

అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది.

నెల్లూరు: అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. అదనపు కట్నం కోసమే  అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు బుధవారం నెల్లూరులో ఆరోపించారు. యూఎస్ కాలిఫోర్నియాలో ఉద్యోగం చేసుకుంటున్న ఉదయ్ కుమార్కు సాయి సింధును ఇచ్చి వివాహం జరిపించామని చెప్పారు.

అయితే అదనపు కట్నం కోసం పెళ్లయిన నాటి నుంచి సాయి సింధును ఉదయ్ వేధించే వాడని వారు ఆరోపించారు. మీ కుమార్తె మరణించిందని ఫోన్లో తెలిపిన ఉదయ్... ఎలా అని తాము ప్రశ్నించగా అనారోగ్యంతో అని సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టాశాడని సాయి సింధు తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement