ప్రైవేటు బస్సుల వేగానికి బ్రేకులు! | RTA seizes 129 private buses | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సుల వేగానికి బ్రేకులు!

Nov 28 2013 3:55 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఇటీవల కొత్తకోట మండలం పా లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అ ప్రమత్తమయ్యారు. పలు ప్రయివేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు.

షాద్‌నగర్, న్యూస్‌లైన్ : ఇటీవల కొత్తకోట మండలం పా లెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆర్టీఏ అధికారులు అ ప్రమత్తమయ్యారు. పలు ప్రయివేటు బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈనెల 1 నుంచి 26వ తేదీ వరకు 129 బస్సులపై దాడులు నిర్వహించారు. వీటి లో 62 బస్సులను స్వాధీనపరచుకుని కేసులు నమోదు చే శారు. ముఖ్యంగా హైదరాబాద్-బెంగళూరు జాతీయ ర హదారిపై రవాణాశాఖ అధికారులు విస్తృత తనిఖీ నిర్వహిస్తున్నారు.
 
 ఆర్టీఏ కిష్టయ్య, షాద్‌నగర్ ఎంవీఐ నాగరాజు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా జీఎంఆర్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు నిర్వహించిన తనిఖీలో 19 బస్సులను సీజ్ చేశారు. ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఆర్టీఏ తెలిపారు. అందుకే విస్తృత తనిఖీలను చేపట్టామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
 
 ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
 ప్రయివేటు బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝు లిపించడంతో ప్రయాణికులు పలు ఇక్కట్లకు గురవుతున్నారు. మరో గంటలో గమ్యస్థానానికి చేరుకుంటామని భావించినా ఆర్టీఏ అధికారుల దాడులతో ప్రయాణికులను ప్రయివేటు బస్సు డ్రైవర్లు రోడ్డు మీదే వదిలి వేస్తున్నారు. దీంతో వారు ఇతర వాహనాల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తోంది. ఏదిఏమైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు బస్సులపై చర్యలు తీసుకోవడం శుభపరిణామని చెబుతున్నారు.
 
 కఠిన చర్యలు తప్పవు
 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్రయివేటు బస్సులపై కేసులు నమోదు చేస్తున్నాం. వీటితోపాటు కార్లు, జీపుల వంటి వాహనాలపైనా దృష్టి సారించాం. ఎవరైనా నిబంధనలు పాటించకుండా వాహ నాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు.
 - నాగరాజు, ఎంవీఐ, షాద్‌నగర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement