బెంగళూరు: గోవా నుంచి బెంగళూరుకు అక్రమంగా ప్రైవేట్ బస్సులో కోటి రూపాయలను తరలిస్తుండగా ఉత్తర కన్నడ జిల్లా కారవార–గోవా సరిహద్దులోని మజాళి చెక్‌పోస్ట్‌లో పోలీసులు పట్టుకున్నారు. చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు చేయగా గోనె సంచిలో దాచిన నోట్ల కట్టలు లభించాయి. బెంగళూరుకు చెందిన కల్లేశ, రాజస్థాన్‌కు చెందిన బమరరామ్‌లు ఈ డబ్బు తరలిస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కల్లేశ, బరమరామ్‌లు గోవాలో ఓ వ్యక్తి నుంచి నగదు తీసుకొని బెంగళూరుకు తీసుకెళుతున్నట్లు చెప్పారు. చిత్తాకుల పోలీసులు నగదు స్వా«దీనం చేసుకోని కేసు నమోదు చేశారు.


