నిబంధనలకు విరుద్ధంగా సీట్లను తీసి స్లీపర్లుగా మారుస్తున్న ట్రావెల్స్
గిరాకీ పెంచుకోవడానికి పాత బస్సులను మార్చి నడిపిస్తున్న వైనం
బస్సుల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సమయాల్లో పట్టించుకోని అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఓ భారీ లోపాన్ని ఎత్తిచూపింది. ప్రమాదానికి గురైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తొలుత సాధారణ సీటర్ బస్సుగా రిజిస్టర్ చేయించిన యాజమాన్యం.. ఆ తర్వాత దాన్ని నిబంధనలకు విరుద్ధంగా స్లీపర్ బస్సుగా మార్పించింది. బస్సు తయారీ సంస్థలు స్లీపర్, సాధారణ సీటర్ బస్సులకు అనుగుణంగా వాటి నిర్మాణంలో భద్రతా ప్రమాణాలు పాటిస్తాయి. కానీ ట్రావెల్స్ నిర్వాహకులు బస్సుల తయారీ కంపెనీల ప్రమాణాలను కాదని సొంతంగా బస్సుల నిర్మాణాన్ని మారి్పంచుకుంటున్నారు.
సీటర్ బస్సుల కంటే స్లీపర్ బస్సులకే ఎక్కువ డిమాండ్ ఉండటంతో గిరాకీ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో పాత సీటర్ బస్సులను అక్రమంగా స్లీపర్ సరీ్వసుగా మార్చి నడుపుతున్నారు. బస్సుల్లో ఎక్కువ సరుకులు పట్టేలాగా కూడా సొంతంగా మార్పులు చేయించుకుంటున్నారు. అలాగే స్లీపర్ బస్సుల్లో కర్టెన్లు, దుప్పట్లు, దిండ్లు వాడుతుండటం, నడిచే ప్రాంతం ఇరుకుగా ఉండటం, బెర్తులకు రక్షణ రాడ్లు ఉండటం తదితర కారణాలతో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఏర్పడే లోపాలు, సమతూకం అగి్నప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడాన్ని కష్టంగా మారుస్తున్నాయి. ఈ లోపాలన్నీ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సమయాల్లో వెలుగుచూస్తున్నా అధికారులు లంచాలు తీసుకొని వదిలేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
స్లీపర్ బస్సుల తయారీ
నిబంధనలు ఇలా..
⇒ స్లీపర్ బస్సుల్లో బెర్తులు 2+1 లేఅవుట్‌లో (ఒకవైపు 2 బెర్తులు, మరోవైపు ఒకటి).
⇒ ట్విన్ యాక్సిల్ బస్సులకు 30 బెర్తులకే (లోయర్ 15, అప్పర్ 15) పరిమితి. మొత్తం 30–36 బెర్తులు.
⇒ స్లీపర్ బస్సుల్లో 2+2 లేఅవుట్‌కు అనుమతి లేదు. ఒక బెర్తు 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు.
⇒ లోయర్ బెర్తు ఎత్తు 200–350 మి.మీ., హెడ్‌రూమ్ 800 మి.మీ. (నాన్–ఏసీ), 600 మి.మీ. (ఏసీ), కుషన్ మందం కనీసం 75 మి.మీ.
⇒ బస్సు పొడవు 12 మీటర్లు, బస్సు ఎత్తు 4.5 మీటర్లు.
⇒ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనీసం 4 ( రెండు రూఫ్ హ్యాచ్‌లు) ఉండాలి. అత్యవసర సమయాల్లో కిటికీ అద్దాలు పగలగొట్టేందుకు అన్ని సీట్ల వద్ద హ్యామర్ ఉండాలి.
విదేశాల్లో స్లీపర్ బస్సులపై ఆంక్షలు, నిషేధం...
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్లీపర్ బస్సులను నిషేధించాయి. కొన్ని దేశాల్లో కఠిన ఆంక్షలున్నాయి. 2012 నుంచి చైనా స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. అంతకు ముందున్న బస్సులను కఠిన ఆంక్షల మధ్య మాత్రమే తిప్పుతోంది. కేవలం నాలుగేళ్లలో స్లీపర్ బస్సుల్లో జరిగిన ప్రమాదాల్లో 231 మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే జర్మనీ సైతం స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. పాత బస్సులను కూడా తొలగించింది. ఆ్రస్టియా, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో పరిమిత సంఖ్యలో, నిబంధనల ప్రకారం ఉన్న బస్సులనే అనుమతిస్తున్నారు. మంటలు అంటుకొనే అవకాశం తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయా దేశాలు డీజిల్ బస్సులకు బదులు ఎలక్ట్రిక్ బస్సులకు వీలు కల్పిస్తున్నాయి.


