30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Rs. 30 lakhs worth red sandalwood seized in chittoor district | Sakshi
Sakshi News home page

30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Nov 22 2014 9:32 AM | Updated on Sep 2 2017 4:56 PM

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగ సమీపంలో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం వెంకట్రాజుల కండ్రిగ సమీపంలో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న ఎర్రచందనాన్ని అటవీశాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే వాహనాన్ని సీజ్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. 

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పట్టుబడిన డ్రైవర్ను విచారిస్తున్నారు. పట్టబడిన ఎర్రచందనం విలువ రూ. 30 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement