తాడేపల్లిగూడెంలో భారీ చోరీ | robbery in thadepalligudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో భారీ చోరీ

Aug 8 2015 2:19 PM | Updated on Aug 30 2018 5:27 PM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడకండ్ల శాంతినగర్‌లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది.

తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడకండ్ల శాంతినగర్‌లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. తాడేపల్లిగూడెం వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు వివరాలు... కడకండ్ల శాంతినగర్ ఒకటవ రోడ్డులో నివాసం ఉంటున్న ఎక్సైజ్ ఉద్యోగి మురళి శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్లారు. అదే అనువుగా భావించిన దొంగలు ఇంట్లో చొరబడి 10 కాసుల బంగారం, 60 వేల రూపాయల నగదు ను దోచుకెళ్లారు. శనివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మురళి దొంగతనం జరిగిన విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement