కృష్ణా జిల్లా విజయవాడ నగరం ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది.
విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడ నగరం ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గ్యాస్‌కట్టర్ సాయంతో ఆలయ కిటీకీ తలుపులు తొలగించిన దుండగులు లోపలికి ప్రవేశించి సాయిబాబా, దత్తాత్రేయ, వినాయక ప్రతిమలకు ఉన్న సుమారు 34 కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకు పోయారు.
అలాగే ఆలయంలోనే ఉన్న రెండు హుండీలను పగులగొట్టి రూ.20 వేల నగదు మాయం చేశారు. ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు ముందుగా సీసీ కెమెరాను పనిచేయకుండా చేశారు. తెల్లవారి విషయం తెలుసుకున్నఆలయ పూజారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(రామవరప్పాడు)