పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం

పద్మావతి, చెన్నై ఎక్స్ప్రెస్ల్లో దొంగల బీభత్సం - Sakshi


అనంతపురం :  తిరుపతి - సికింద్రాబాద్‌ మధ్య నడిచే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైలు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి రాగానే  దుండగులు చైను లాగి దోపిడీ చేశారు. ఎస్-6,7,8,9 బోగీల్లో ప్రయాణికుల నుంచి  నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు.


 


ఇక చెన్నై-సికింద్రాబాద్ మధ్య నడిచే చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ దొంగలు మరోసారి దోపిడీ తెగబడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు సమీపంలో ఓ మహిళ నుంచి దుండగులు బంగారం అపహరించి పరారయ్యారు. వారం వ్యవధిలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దుండగులు మూడుసార్లు దోపీడీకి పాల్పడ్డారు.  ప్రయాణికుల భద్రతలో వైఫల్యం చెందుతున్న రైల్వే సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top