హౌరా నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులతో గుర్తుతెలియని వ్యక్తి పలాయనం చిత్తగించాడు.
రాజమండ్రి (తూర్పుగోదావరి) : హౌరా నుంచి చెన్నై వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ముగ్గురు ప్రయాణికులకు మత్తుమందు ఇచ్చి వారి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువులతో గుర్తుతెలియని వ్యక్తి పలాయనం చిత్తగించాడు. రైలు గురువారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో రాజమండ్రి స్టేషన్లో ఆగినా.. ముగ్గురు ప్రయాణికులు ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటాన్ని గమనించిన తోటి ప్రయాణికులు వారిని నిద్ర లేపడానికి ప్రయత్నించారు.
అయినా ఫలితం లేకపోవడంతో.. రైల్వే డాక్టర్‌ను సంప్రదించారు. వారిని పరిశీలించిన డాక్టర్ ఎవరో మత్తు మందు ఇచ్చారని తేల్చారు. ఇప్పటికీ ఆ ముగ్గురు ప్రయాణికులు స్పృహలోకి రాకపోవడంతో.. వారి వద్ద నుంచి ఎంత మొత్తం అపహరించకుపోయారనే విషయంలో స్పష్టత రాలేదు.