మహీంద్ర షోరూంలో చోరీ | Robbery in Anantapur Mahindra Showroom | Sakshi
Sakshi News home page

మహీంద్ర షోరూంలో చోరీ

Nov 7 2014 8:55 AM | Updated on Aug 30 2018 5:27 PM

అనంతపురం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు.

అనంతపురం: అనంతపురం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. రుద్రంపేట సమీపంలోని మహీంద్ర షోరూంలో దొంగలు దాదాపు రూ. 15 లక్షలు అపహరించుకుని పోయారు. అయితే వారి ప్రయత్నాన్ని షోరూం భద్రత సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో దొంగలు భద్రత సిబ్బందిపై దాడి చేసి పరారైయ్యారు.

దాంతో భద్రత సిబ్బంది పోలీసులుకు ఫిర్యాదు చేసి... షోరూమ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో పోలీసులు, యాజమాన్యం సంఘటన స్థలానికి చేరుకుని చోరీ వివరాలను భద్రత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీసులు చేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా దొంగల దాడిలో భద్రత సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement