ముగ్గురు వాహన దొంగల అరెస్ట్ | robbery gang arrested in chittoor district | Sakshi
Sakshi News home page

ముగ్గురు వాహన దొంగల అరెస్ట్

Dec 23 2015 1:23 PM | Updated on Aug 30 2018 5:27 PM

చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ముగ్గురు వాహన దొంగలను బుధవారం అరెస్ట్ చేశారు.

మదనపల్లి: చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు ముగ్గురు వాహన దొంగలను బుధవారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు పట్టణంలోని చౌడశ్రీ కల్యాణమండపం మసీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివరాజ్ (20), ఉదయ్ (17)తో పాటు వైఎస్సార్ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌లు బెంగళూరులో మూడు, మదనపల్లిలో ఒక ద్విచక్రవాహనం చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement