మాజీ సైనికుడి ఇంట్లో చోరీ | Robbery at former soldier home | Sakshi
Sakshi News home page

మాజీ సైనికుడి ఇంట్లో చోరీ

Jul 23 2015 2:25 AM | Updated on Aug 30 2018 5:27 PM

పట్టణంలోని నల్లబండ బజారు సెయింట్‌పాల్స్ పాఠశాల వీధిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు

♦ 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేలు అపహరణ
♦ పక్క ఇంటి తాళాలు పగులగొట్టి ఏమీ దొరక్క వెళ్లిపోయిన వైనం
 
 నల్లబండ బజారు (గిద్దలూరు రూరల్) : పట్టణంలోని నల్లబండ బజారు సెయింట్‌పాల్స్ పాఠశాల వీధిలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. మాజీ సైనికుడు ఏరువా లింగారెడ్డి ఇంట్లో 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదును అపహరించుకెళ్లారు. పక్కనే ఉన్న తాపీమేస్త్రీ షేక్ ఖాదర్‌వలి ఇంటి తాళాలు పగుల గొట్టిన దొంగలు బీరువా, కబోర్డ్స్ తెరచి వస్తువులను చెల్లాచెదురు చేశారు. అక్కడ ఏమీ దొరక్కపోవడంతో వెళ్లిపోయారు. అందిన వివరాల మేరకు.. ఏరువా లింగారెడ్డి తన ఇంటికి తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి పైఅంతస్థులో నిద్రిస్తున్నారు.

అది గమనించిన దొంగలు రాత్రి సమయంలో కింద గృహంలోని త లుపు తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువా తెరచి అందులోని రెండు ఉంగరాలు, రెండు జతల కమ్మలు, తాళిబొట్టు, బంగారు గొలుసు, బంగారు ఆభరణాలు అపహరించారు. పక్క ఇంటి యజమాని ఖాదర్‌వలి తన కుటుంబ సభ్యులతో ఊరికెళ్లగా దొంగలు తాళాలు పగులగొట్టి బీరువా, కబోర్డ్స్ వెతికారు. అక్కడ వారికి ఎటువంటి విలువైన వస్తువులు లభించకపోవడంతో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సీఐ ఎండీ ఫిరోజ్ బుధవారం ఉదయం సంఘటన స్థలాలకు వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బాధితుల వద్ద నుంచి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐ వెంట ఏఎస్సై రఫీ, సీఐ రైటర్ ఉదయ్, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement