స్కార్పియో, బైక్ ఢీ.. ఒకరి మృతి | road accident one died in ysr district | Sakshi
Sakshi News home page

స్కార్పియో, బైక్ ఢీ.. ఒకరి మృతి

Nov 9 2015 12:08 PM | Updated on Aug 30 2018 3:56 PM

స్కార్పియో-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది.

వైఎస్సార్ జిల్లా: స్కార్పియో-బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వైఎస్సార్ జిల్లాలో చోటు చేసుకుంది. కొండాపురం మండలం చౌకిపల్లి  గ్రామానికి చెందిన సంజీవులు(40) బైకు పై వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement