కనకదుర్గ వారధిపై ప్రమాదం: వ్యక్తి మృతి | road accident at krishna rivar | Sakshi
Sakshi News home page

కనకదుర్గ వారధిపై ప్రమాదం: వ్యక్తి మృతి

Feb 25 2015 8:45 AM | Updated on Apr 3 2019 7:53 PM

విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

గుంటూరు : విజయవాడలోని కృష్ణానదిపై ఉన్న కనకదుర్గ వారధిపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని విజయవాడకు చెందిన బంగారునాయుడుగా పోలీసులు గుర్తించారు. ఆటోలో దినపత్రికలను తీసుకుని తాడేపల్లి నుంచి విజయవాడకు వస్తుండగా...  వారధిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది.

ఈ ప్రమాదంలో బంగారునాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారధిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(తాడేపల్లి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement