పాతకక్షలతో కర్నూలులో వ్యక్తి హత్య | revenge murder in kurnool | Sakshi
Sakshi News home page

పాతకక్షలతో కర్నూలులో వ్యక్తి హత్య

Apr 1 2015 4:57 PM | Updated on Jul 30 2018 8:29 PM

పాతకక్షల కారణంగా కర్నూలులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు నగరం వడ్డెగేరిలో బుధవారం సాయంత్రం జరిగింది.

కర్నూలు : పాతకక్షల కారణంగా కర్నూలులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు నగరం వడ్డెగేరిలో బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వడ్డెగేరికి చెందిన అస్లాం (40) అనే వ్యక్తి బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఫ్యాన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. బుధవారం సాయంత్రం వడ్డెగేరిలో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు అస్లాంపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హతుడు పాత నేరస్తుడని, సినీ అభిమానుల మధ్య గతంలో గొడవలున్నాయనీ, ఆ పాత కక్షల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నామనీ  పోలీసులు వెల్లడించారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement