పలావు ప్యాకెట్ విషయంలో ఇద్దరు కాంట్రా క్టు కార్మికుల మధ్య తలెత్తిన వివాదం ఓ యువకుని హత్యకు దారితీసింది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ నిండు ప్రాణాన్ని బలిగొంది.
పెండ్యాల (నిడదవోలు) : పలావు ప్యాకెట్ విషయంలో ఇద్దరు కాంట్రా క్టు కార్మికుల మధ్య తలెత్తిన వివాదం ఓ యువకుని హత్యకు దారితీసింది. మద్యం మత్తులో జరిగిన ఘర్షణ నిండు ప్రాణాన్ని బలిగొంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పెండ్యాలలో పుష్కర విధులు నిర్వహించేందుకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన 30 మంది కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు వచ్చారు. వీరు స్థానికంగా ఉన్న మండల పరిషత్ పాఠశాలలో బస చేశారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం సేవించిన పారిశుధ్య కార్మికులు న ల్లారెడ్డి రాజేష్ (24), కోలా అప్పారావు మధ్య పలావు విషయంలో గొడవ జరిగింది. రాజేష్ తనకిచ్చిన పలావు ప్యాకెట్‌లో పెరుగు చెట్నీ, సేరువా లేదని అప్పారావును నిలదీ శాడు.
మద్యం మత్తులో అప్పారావుపై రాజేష్ దాడి చేశాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వారిద్దరికీ సర్దిచెప్పి వెళ్లిపోయూరు. స్వల్పంగా గాయపడిన అప్పారావు కోపోద్రేకుడై తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిద్రపోతున్న రాజేష్ తలపై పెద్ద రారుుతో మోది హతమార్చాడు. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెం దాడు. అప్పారావు పరారీలో ఉన్నాడు. నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ, తహసిల్దార్ ఎం.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిడదవోలు రూరల్ ఎస్సై నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.