విశాఖలో బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు | Reported to police on Balakrishna in vishaka | Sakshi
Sakshi News home page

విశాఖలో బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

Mar 9 2016 4:33 AM | Updated on Aug 29 2018 1:59 PM

విశాఖలో బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు - Sakshi

విశాఖలో బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

మహిళలను కించపరిచేలా మాట్లాడిన హిందూపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది.

అక్కయ్యపాలెం: మహిళలను కించపరిచేలా మాట్లాడిన హిందూపూర్ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై విశాఖ పోలీసులకు ఫిర్యాదు అందింది. సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కర్రి ఆదిబాబు నగరంలోని ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో బాలకృష్ణ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు మహిళల పట్ల బాలకృష్ణ వైఖరి ఏంటో తెలియ చేస్తాయని పేర్కొన్నారు.

మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడిన బాలకృష్ణపై ఐపీసీ సెక్షన్ 354, నిర్భయ చ ట్టాల కింద  కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అయితే పోలీసులు ఇంకా ఎటువంటి కేసు నమోదు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement