బాబొచ్చారు.. జాబులూడాయి.. | Removal orders for 800 AYUSH employees | Sakshi
Sakshi News home page

బాబొచ్చారు.. జాబులూడాయి..

May 3 2017 2:19 AM | Updated on Aug 14 2018 11:26 AM

బాబొస్తే జాబొస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజా గా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు.

800 మంది ఆయుష్‌ ఉద్యోగులకు తొలగింపు ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: బాబొస్తే జాబొస్తుందని చెప్పిన సీఎం చంద్రబాబు.. తాజా గా కాంట్రాక్టు ఉద్యోగులకు షాకిచ్చారు. ఆయుష్‌ విభాగంలో పని చేస్తున్న 800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ల అవసరం లేదని, జీతాలు ఇవ్వలేమని, వారిని ఇంటికి పంపించండని ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా 2016 – 17లో పని చేసిన 12 నెలల కాలానికి వేతనం కూడా ఇవ్వకూడదని నిర్దాక్షిణ్యంగా చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. తాజా ఉత్తర్వులతో భవిష్యత్‌లో ఇంకా ఎంత మందిని సర్కారు తొలగిస్తుందోననే భయాందోళన మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement