శేషాచల అడవుల్లో కూంబింగ్ | red sanders caught in seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచల అడవుల్లో కూంబింగ్

Dec 14 2015 11:32 AM | Updated on Sep 3 2017 1:59 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మండలంలోని బొమ్మాజి కొండ వద్ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రఘురామ్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులకు అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.
 
అధికారులను చూసిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. పరారైన కూలీల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement