రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red sandalwood worth Rs 2 crore seized in Kadapa District | Sakshi
Sakshi News home page

రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Dec 17 2014 10:57 AM | Updated on Sep 2 2017 6:20 PM

ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది.

కడప: ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. అందులోభాగంగా పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. కానీ స్మగ్లర్లు మాత్రం ఎర్రచందనాన్ని అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్నారు. బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒంటిమిట్ట మండలం మంటపంపల్లిలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement