రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం.. | red sandalwood Smugglers arrested | Sakshi
Sakshi News home page

రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం..

Mar 20 2017 11:58 AM | Updated on Sep 5 2017 6:36 AM

కర్ణాటక రాష్ట్రంలోని మాలేరులో రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

చిత్తూరు క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని మాలేరులో రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన జ్యోతి(43), ఆమె భర్త నాగేంద్ర, వేలూరులో బీటెక్‌ చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం వేలూరులో అరెస్టు చేశారు. వీరంతా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరిని చిత్తూరు తరలించిన పోలీసులు ఎస్పీ సమక్షంలో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement