నా కుమార్తె మృతిపై న్యాయం చేయాలి

Recently Dead Student Mother Want Justice In Chittoor - Sakshi

సాక్షి, తిరుపతి: భవానినగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఈనెల 5వ తేదీన అనుమానాస్పదంగా తన కుమార్తె పవిత్ర మృతి చెందడంపై సంబంధిత అధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేయాలని పవిత్ర తల్లి ప్రమీల కోరా రు.  మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల ఒకటో తేదీన తన కుమార్తె పవిత్రను కళాశాలలో బీఎస్సీ కోర్సులో చేర్చి హాస్టల్లో ఉంచామన్నారు. అయితే 5వ తేదీన కళాశాలలో  ఆరు అంతస్తుల భవనం నుంచి పడి తన కుమార్తె చనిపోయిందని కళాశాల యాజమాన్యం తెలిపిందని, తన బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోయినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారని ఆవేదన వ్యక్తం చేసింది.

తన కుమార్తె స్నేహితురాలి సమాచారంతో తాము రుయా ఆసుపత్రికి చేరుకున్నామని, పవిత్ర మృతి విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే  పొంతన లేని సమాధానం చెబుతోందని తెలిపారు. దీనిపై  పోలీసు కేసు కూడా నమోదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని, సమగ్ర విచారణ చేసి తగు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆమెతో పాటు మృతు రాలి బంధువులు చంద్రశేఖర్, కుమార్, నాగరాజు, అనిత పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top