కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ విజయసింగ్ షెకావత్ దర్శించుకున్నారు.
మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్రస్వామిని ఆర్‌బీఐ జనరల్ మేనేజర్ విజయసింగ్ షెకావత్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం మంత్రాలయం చేరుకున్నారు. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆర్‌బీఐ ఇంచార్జీ ఆర్‌ఎన్. దాసు స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మాంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బృందావనం చేరుకొని రాఘవేంద్రస్వామి పూజలు నిర్వహించారు. వీరికి శ్రీమఠం ఫిఠాదిపతి సుభుదేంద్రతీర్థులు ఫలమంత్ర అక్షింతలు సమర్చించారు.